GST: రేపు హైదరాబాద్ పోలీసుల ముందుకు రానున్న రాంగోపాల్ వర్మ

  • జీఎస్టీ వ్యవహారంపై ప్రశ్నించనున్న పోలీసులు
  • మహిళలను కించపరిచారన్న ఆరోపణలపై కూడా
  • శనివారం విచారణకు వస్తానని చెప్పిన వర్మ

జీఎస్టీ (గాడ్, సెక్స్ అండ్ ట్రూత్) షార్ట్ ఫిల్మ్ వ్యవహారం, ఆపై ఓ టీవీ చానల్ లో లైవ్ లో మాట్లాడుతూ, మహిళలను కించపరిచారన్న అభియోగాలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, రేపు హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయన్నుంచి సమాచారం అందిందని పోలీసు అధికారులు తెలియజేశారు. కాగా, పోలీసుల తొలి నోటీసులను అందుకున్న రాంగోపాల్ వర్మ, తాను షూటింగ్ కారణంగా బిజీగా ఉన్నందున ప్రస్తుతం విచారణకు రాలేనని స్పష్టం చేయడంతో ఆయనకు సీసీఎస్ పోలీసులు రెండో నోటీసును జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న వర్మ, తాను శనివారం నాడు విచారణకు వస్తానని సమాచారం ఇచ్చినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

GST
Ramgopal Varma
CCS
Police
Hyderabad
  • Loading...

More Telugu News