achchenaidu: రాష్ట్రంలో ఈ దుస్థితికి కార‌ణాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ గుర్తించాలి: మ‌ంత్రి అచ్చెన్నాయుడు

  • పవన్ కల్యాణ్ పోరాటంలో తప్పులేదు
  • రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయన పోరాడుతున్నారు
  • తనతో చేతులు కలపాలని కాంగ్రెస్ నాయకులను పవన్ అడగడం బాధ అనిపించింది
  • ఏపీలో ఈ దుస్థితికి కారణం  కాంగ్రెస్ పార్టీ నేతలే

ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం చేసిన సాయంపై సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ వేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రేపు పలు పార్టీల నేతలు, రాజకీయ వేత్తలతో పవన్ సమావేశం కానున్నారు. ఈ విషయంపై స్పందించిన ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ పోరాటంలో తప్పులేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయన పోరాడుతున్నారని చెప్పారు. అయితే, జేఎఫ్‌సీ విషయంలో తనతో చేతులు కలపాలని కాంగ్రెస్ నాయకులను పవన్ అడగడం బాధ అనిపించిందని వ్యాఖ్యానించారు. ఏపీలో ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ నేతలేనన్న విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తించాలని అన్నారు.

కాగా, కాపు రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) అభ్యంతరాలు తెలిపిందని, దీనిని నిలిపి ఉంచాలంటూ కేంద్ర హోంశాఖకు సూచించిందని, అయితే, దీనిపై కాపు నాయకులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వ అధికారులు వివ‌ర‌ణ అడిగారని, 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఎలా సాధ్యమో స్పష్టం చేయాలని అడిగారని వివరించారు. తాము
అవసరమైతే కేంద్ర ప్రభుత్వం పెద్దలను కలిసి ఒప్పిస్తామని చెప్పారు. షెడ్యూల్ 9లో చేర్చి చట్టం అమలు చేయాలని చిత్తశుద్ధితో ఉన్నామని అన్నారు.

  • Loading...

More Telugu News