sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. కుప్పకూలిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్లు
- ఒడిదుడుకులకు గురైనప్పటికీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- సెన్సెక్స్ 142, నిఫ్టీ 45 అప్
- రెండో రోజు కూడా పతనమైన పీఎన్బీ
అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు... ఆ తర్వాత ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపడంతో ఒడిదుడుకులకు గురయ్యాయి. చివరకు లాభాల్లో ముగిశాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 350కు పైగా లాభంతో ట్రేడ్ అయింది. 11 వేల కోట్ల కుంభకోణం వెలుగు చూడటంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్లు ఈ రోజు కూడా పతనమయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 142 పాయింట్ల లాభంతో 34,297కు పెరిగింది. నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 10,545 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బాంబే డయింగ్ (7.88%), వక్రాంగీ (4.98%), రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ (4.91%), నెస్లే ఇండియా (4.28%), ప్రిస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్ లిమిటెడ్ (3.77%).
టాప్ లూజర్స్:
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (-11.97%), రెప్కో హోమ్ ఫైనాన్స్ (-7.36%), మ్యాక్స్ ఇండియా (-6.60%), జెట్ ఎయిర్ వేస్ (-5.89%), టిటాఘర్ వాగన్స్ లిమిటెడ్ (-5.80%).