Sanjay Leela Bhansali: భన్సాలీతో మరో మూడు చిత్రాల్లో రణ్‌వీర్-దీపిక?

  • రణ్‌వీర్-దీపిక నటనకు ఫిదా అయిన దర్శకధీరుడు
  • ఆయన దర్శకత్వంలో మూడు చిత్రాలు చేసిన ప్రేమజంట
  • వారితో ఆరేళ్ల పాటు మరో మూడు చిత్రాలకు దర్శకుడి డీల్?

బాలీవుడ్‌లో భారీ సెట్టింగులతో చారిత్రక సినిమాలు తీసే దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీకి గొప్ప పేరుంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి రేపోమాపో ఒక్కటవబోతున్న ప్రేమ జంట రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకునే ఆయన దర్శకత్వంలో ఇదివరకే రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ చిత్రాలు చేశారు. బాలీవుడ్‌లో ఇపుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది. వారిద్దరూ కలిసి ఆయన దర్శకత్వంలోనే మరో మూడు చిత్రాల్లో నటించనున్నారట.

దీనికి సంబంధించి వారి మధ్య డీల్ కూడా కుదిరిందని బాలీవుడ్ ట్రేడ్ ఇన్‌సైడర్ ఒకరు చెప్పినట్లు 'ఆసియన్ ఏజ్' పత్రిక ఉటంకించింది. వారిద్దరి నటన మాత్రమే కాక ప్రొఫెషన్ పట్ల వారి అంకితభావానికి ఆయన ఫిదా అయిపోయారని, అందుకే వారితో మళ్లీ కలిసి పనిచేయాలని ఆయన డిసైడ్ అయ్యారట. పద్మావత్ సినిమా షూటింగ్‌కు, ఆ చిత్రం విడుదలకు అడ్డంకులు ఎదురైనప్పుడు వారు ఎంతో సహనంతో సహకరించడం భన్సాలీకెంతో నచ్చిందట. అందువల్ల వారిద్దరితో ఆరేళ్ల పాటు మూడు సినిమాలకు ఆయన డీల్ కుదుర్చుకున్నారట.

Sanjay Leela Bhansali
Deepika Padukone
Ranveer Singh
Padmaavat
  • Loading...

More Telugu News