YSRCP: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్!

  • ప్రత్యేక హోదా కోసం మేము చేస్తున్న పోరాటంలో టీడీపీ కలిసి రావాలి
  • మా ఎంపీలతో రాజీనామా చేయిస్తా
  • టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలి 
  • అలా చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాం? : జగన్

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న పోరాటంలో టీడీపీ తమతో కలిసి రావాలని వైసీపీ అధినేత జగన్ అన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. ఉదయగిరి నియోజకవర్గం రేణమాలలో జగన్ మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ని పక్కనపెట్టి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు తమతో కలిసి రావాలని ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని, అలాగే తన ఎంపీలతో కూడా చంద్రబాబు రాజీనామా చేయించాలని, అలా చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామని జగన్ సవాల్ విసిరారు. 

  • Loading...

More Telugu News