neerav modi: ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై ప్రియాంక చోప్రా దావా?

  • నీరవ్ డైమండ్ బ్రాండ్ కు ప్రచారకర్తగా ఉన్న ప్రియాంక చోప్రా
  • ఓ వ్యాపార ప్రకటన పారితోషికం ఎగ్గొట్టారని ఆరోపణ
  • నిజమేనంటున్న బాలీవుడ్ వర్గాలు

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్ బీ)లో మోసపూరిత లావాదేవీలకు పాల్పడ్డ  ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా దావా వేసింది. నీరవ్ కు చెందిన డైమండ్ బ్రాండ్ కు ప్రచారకర్తగా వ్యవహరించే తనకు ఓ వ్యాపార ప్రకటనకు సంబంధించిన పారితోషికం ఆయన ఎగ్గొట్టారంటూ కోర్టులో దావా వేసినట్టు తెలుస్తోంది.

కొన్ని నెలల క్రితం బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ప్రియాంక ఈ వ్యాపార ప్రకటనలో నటించింది. ఈ వ్యాపార ప్రకటనకు సంబంధించిన పారితోషికాన్ని ఆమెకు, సిద్ధార్థ్ మల్హోత్రాకు ఇంత వరకూ ఇవ్వలేదని బాలీవుడ్ వర్గాల సమాచారం. కాగా,  పీఎన్ బీలో నీరవ్ మోదీ కుంభకోణం బయటపడటంతో నీరవ్ సన్నిహితులు, బాలీవుడ్ సెలెబ్రిటీలు అతనికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం.

neerav modi
priyanka chopra
  • Loading...

More Telugu News