Telangana: తెలంగాణలో పాదయాత్రకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి!

  • కొత్త ప్రాజెక్టుల సాధనే లక్ష్యం
  • అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోగా యాత్ర
  • కొడంగల్ నుంచి హైదరాబాద్ వరకూ

పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త్వరలోనే పాదయాత్రను చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న వికారాబాద్ - కృష్ణా రైల్వే లైన్ సాధన, నారాయణ పేట్ - కొడంగల్ ఎత్తిపోతలకు నిధుల కేటాయింపు కూడా ఆయన డిమాండ్లలో ఉన్నాయి.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోగా పాదయాత్రను పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. కొడంగల్ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర, 120 కిలోమీటర్లు సాగి హైదరాబాద్ లో ముగుస్తుందని రేవంత్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. రోజుకు 15 కిలోమీటర్ల దూరం ఆయన నడుస్తారని,  బొంరాస్‌పేట్, పరిగి, నస్కల్‌, వికారాబాద్‌, మన్నెగూడ, చిట్టెంపల్లి చౌరస్తా, చేవెళ్ల, మొయినాబాద్‌ మీదుగా యాత్ర సాగుతుందని తెలుస్తోంది.

Telangana
Revanth Reddy
Padayatra
Kodangal
Vikarabad District
  • Loading...

More Telugu News