kambhampati hari babu: జగన్ 'రాజీనామా' నిర్ణయంపై ఎంపీ కంభంపాటి హరిబాబు స్పందన

  • ఎంపీలకు ప్రజలు ఓటు వేసి, ఐదు సంవత్సరాలు పాలించమని చెప్పారు
  • ఎందుకు రాజీనామా చేస్తామంటున్నారు?
  • చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు పరుస్తోన్న సమయంలోనే జగన్ ఇటువంటి ప్రకటన చేయడం సరికాదు

ప్రత్యేక హోదా కోసం త‌మ ఎంపీలు వ‌చ్చేనెల 5 నుంచి ఏప్రిల్ 6 వరకు పార్లమెంటులో నిరసనలు తెలుపుతారని, అప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే తమ పార్టీ లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేస్తారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్ చేసిన వాఖ్యలపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు విరుచుకుపడ్డారు.

ఎంపీలకు ప్రజలు ఓటు వేసి, ఐదు సంవత్సరాలు పాలించమని చెబితే ఎందుకు రాజీనామా చేస్తామంటున్నారని హరిబాబు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో చట్టంలో పొందుపరిచిన అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సమయంలోనే జగన్ ఇటువంటి ప్రకటన చేయడం సరికాదని అన్నారు.    

kambhampati hari babu
Union Budget 2018-19
YSRCP
  • Loading...

More Telugu News