dasoju sravan: నా గురించి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు: దాసోజు శ్రవణ్

  • టీఆర్ఎస్ లో చేరుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • అధికార పార్టీనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తోంది
  • త్వరలోనే ఇలాంటి వారికి బుద్ధి చెబుతా

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, టీఆర్ఎస్ లో చేరుతున్నానంటూ తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ కుమార్ చెప్పారు. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీనే పనిగట్టుకుని తనపై ఇలాంటి అసత్య ప్రచారానికి దిగుతోందని మండిపడ్డారు.

తన గురించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీసీఎస్ డీసీపీ అవినాహ్ మహంతికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి నీచ రాజకీయాలను చేస్తున్నవారికి త్వరలోనే బుద్ధి చెబుతామని అన్నారు.

dasoju sravan
tpcc
TRS
Congress
  • Loading...

More Telugu News