Chinthamaneni Prabhakar: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు రెండేళ్ల జైలు శిక్ష!

  • మాజీ మంత్రిపై చేయి చేసుకున్న కేసులో రెండేళ్ల జైలు శిక్ష
  • గన్‌మెన్‌ను కొట్టిన కేసులో 6 నెలలు
  • రచ్చబండ వేదిక దగ్గర గొడవకు కారణమైనందుకు మరో ఆరునెలలు
  • ఏకకాలంలో శిక్ష 

పలు కేసుల్లో దోషిగా తేలిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు భీమడోలు మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు నిచ్చింది. గత ఎన్నికల్లో చింతమనేని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఆయన 2011లో గ్రామసభలో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై చేయి చేసుకున్నారు. ఈ కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. అంతేగాక, గన్‌మెన్‌ను కొట్టిన కేసులో 6 నెలలు, రచ్చబండ వేదిక దగ్గర గొడవకు కారణమైనందుకు మరో ఆరు నెలలు శిక్ష పడింది. ఈ శిక్షలను ఏకకాలంలో ఆయన అనుభవించనున్నారు. ఆయనకు రూ.2,500 జరిమానా కూడా విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. 

  • Loading...

More Telugu News