vijay: చడీచప్పుడూ లేకుండా.. రాజకీయాల్లోకి ప్రవేశించే ప్రక్రియ ప్రారంభించిన సినీ నటుడు విజయ్‌!

  • గత ఏడాది సెప్టెంబర్‌లోనే సభ్యులను చేర్చడానికి మొబైల్ యాప్ ప్రారంభించిన విజయ్‌
  • బూత్‌ కమిటీల ఏర్పాటు పనులు కూడా షురూ
  • ఆ బాధ్యతలను అఖిల భారత విజయ్‌ ప్రజా సంఘం అధ్యక్షుడు బుస్సీ ఆనంద్‌కు అప్పగింత
  • స్పష్టమైన ఆదేశాలు

తమిళనాడులో పెద్ద ఎత్తున సినీనటులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తోన్న విషయం తెలిసిందే. అక్కడి అగ్రనటుల్లో ఒకరైన విజయ్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించే క్రమంలో ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నానంటూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, చడీచప్పుడూ లేకుండా ప్రజా సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని విజయ్‌ ప్రజా సంఘం నిర్వాహకులు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన రజనీకాంత్ సభ్యులను చేర్చడానికి గత నెల వెబ్ సైట్‌ ప్రారంభించారని గుర్తు చేసిన విజయ్ ప్రజా సంఘం.. తమ నాయకుడు విజయ్‌ గత ఏడాది సెప్టెంబర్‌లోనే సభ్యులను చేర్చడానికి మొబైల్ యాప్ ప్రారంభించారని తెలిపింది. అంతేకాదు బూత్‌ కమిటీల ఏర్పాటు పనులు కూడా జరుగుతున్నాయని చెప్పింది.

బూత్‌ కమిటీ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతలను అఖిల భారత విజయ్‌ ప్రజా సంఘం అధ్యక్షుడు బుస్సీ ఆనంద్‌కు విజయ్ అప్పగించినట్లు తెలిసింది. మొదట ఏయే ప్రాంతాల్లో తిరగాలి? బూత్ కమిటీలను ఎలా ఏర్పాటు చేయాలనే విషయాలపై విజయ్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సభ్యులను చేర్చే ప్రక్రియ ఇప్పటికే సగం పూర్తయినట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News