bolla bulliramaiah: బోళ్ల మృతిపట్ల వెంకయ్యనాయుడు, చంద్రబాబుల సంతాపం

  • ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన బోళ్ల
  • అందరి ప్రేమాభిమానాలను పొందారన్న వెంకయ్య
  • బోళ్ల అందించిన సేవలు వెలకట్టలేనివన్న చంద్రబాబు

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బోళ్ల బుల్లిరామయ్య ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మరణం పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. బుల్లిరామయ్య మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుని వెళ్లేవారని, అందరి ప్రేమాభిమానాలను పొందారని, ఎల్లవేళలా అభివృద్ధి కోసం తపించేవారని వెంకయ్య ఈ సందర్భంగా బోళ్లను కొనియాడారు. వారి మరణాన్ని తట్టుకునే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని, వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

బోళ్ల బుల్లిరామయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని అన్నారు.

bolla bulliramaiah
condolences
Venkaiah Naidu
Chandrababu
  • Loading...

More Telugu News