nithin: నితిన్ 'చల్ మోహన్ రంగ' టీజర్ !

  • నితిన్ కెరీర్లో ఇది 25వ చిత్రం
  • త్రివిక్రమ్ కథ.. తమన్ సంగీతం 
  • ఏప్రిల్ 5న విడుదల

నితిన్, మేఘా ఆకాష్ జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'చల్ మోహన్ రంగ' చిత్రం టీజర్ ని కొద్దిసేపటి క్రితం వదిలారు. టీజర్లో నితిన్ తన లవ్ స్టోరీ గురించి వివరిస్తున్నట్లుగా ఉంది. 'వర్షాకాలంలో కలుసుకున్న మేము శీతాకాలంలో ప్రేమించుకుని వేసవి కాలంలో విడిపోయాం' అంటూ నితిన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.

నితిన్ కెరీర్లో ఇది 25వ చిత్రం కావడం విశేషం. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథను అందివ్వగా, తమన్ స్వరాలను సమకూర్చుతున్నాడు. ఏప్రిల్ 5న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.

nithin
chal mohana ranga
tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News