cpm: బీజేపీపై వైసీపీ తన వైఖరిని స్పష్టం చేయాలి: సీపీఎం ఏపీ కార్యదర్శి మధు

  • సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన మధు
  • విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించింది
  • పోలవరం నిర్మాణానికి ఇంకా నిధులు రావాల్సి ఉంది
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమిస్తాం- మధు 

భారతీయ జనతా పార్టీపై వైసీపీ తన వైఖరిని స్పష్టం చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైసీపీ స్పందిస్తోన్న తీరును ఆయన తప్పుబట్టారు. సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా మధు రెండోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని, అలాగే పోలవరం నిర్మాణానికి ఇంకా నిధులు రావాల్సి ఉందని మధు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఉద్యమిస్తామని చెప్పారు. తాము ఇటీవల నిర్వహించిన బంద్‌కు వైసీపీ మద్దతును కోరామని, అయితే ఆ పార్టీ సరిగ్గా స్పందించలేదని చెప్పారు.

cpm
madhu
Union Budget 2018-19
YSRCP
BJP
  • Loading...

More Telugu News