apple: సాఫ్ట్ వేర్, ఉత్పత్తుల తయారీ వ్యూహాలకు పదును పెడుతున్న యాపిల్!
- నాణ్యత, సౌకర్యాలపై దృష్టి
- ప్రత్యర్థుల కంటే ముందుండే వ్యూహం
- లోపాలకు చెక్... గత నెల నుంచే అమలు
ప్రపంచంలో మొబైల్ టెక్నాలజీలో అగ్రగామి సంస్థ అయిన యాపిల్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. సాఫ్ట్ వేర్, ఉత్పత్తుల తయారీ వ్యూహాల్లో మార్పులు చేస్తోంది. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం... ఉత్పత్తుల అభివృద్ధి విధానాలను మెరుగుపరుస్తోంది. బగ్స్ ను సాఫ్ట్ వేర్ మూలాల నుంచి తొలగించే పనికి శ్రీకారం చుట్టింది. ప్రత్యర్థులను వెనక్కి నెట్టేసేలా కీలకమైన ఫీచర్లపై దృష్టి సారించింది.
యాపిల్ సాఫ్ట్ వేర్ చీఫ్ క్రాగ్ పెడ్ రిగి గత నెలలోనే ఈ కొత్త వ్యూహాన్ని కంపెనీ ఇంజనీర్లకు తెలియజేశారు. సాఫ్ట్ వేర్ అభివృద్ధి బృందం కొత్త ఫీచర్ల అభివృద్ధిపై మరింత సమయం వెచ్చించనుంది. లోపాలకు తావులేకుండా, యాపిల్ సాఫ్ట్ వేర్ లో బగ్ లు ప్రవేశించకుండా సాఫ్ట్ వేర్ ను రూపొందించనుంది.