nirmala seetha raman: భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.. భారత సైనికులపై దాడిపై పాకిస్థాన్‌కు నిర్మలా సీతారామన్‌ వార్నింగ్!

  • జైషే ఈ మొహమ్మద్ (జేఈఎమ్‌) ఉగ్ర సంస్థే ఈ దాడి చేసింది
  • దుస్సాహసంపై పాకిస్థాన్ మూల్యం చెల్లించుకుంటుంది
  • ఉగ్రదాడిపై ఎవరు చేశారన్న దానిపై ఆధారాలు సంపాదించాం

జమ్మూ కశ్మీర్‌లో సుంజువాన్‌ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు చెందిన జైషే ఈ మొహమ్మద్ (జేఈఎమ్‌) ఉగ్ర సంస్థే ఈ దాడి చేసిందని భారత్ గుర్తించింది. ఈ దాడిపై భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు తెలిపారు. ఈ దుస్సాహసంపై పాకిస్థాన్ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.

పాక్ వెనకేసుకొస్తోన్న జేఈఎమ్ ఉగ్రదాడికి ప్రణాళిక రూపొందించిందని నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రతి దాడులు జరిపిన భారత ఆర్మీ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిందని చెప్పారు. ఈ ఉగ్రదాడి ఎవరు చేశారన్న దానిపై తాము ఇప్పటికే ఆధారాలు సంపాదించామని, పాక్ ప్రభుత్వానికి వాటిని పంపుతామని చెప్పారు.

తాము ఆధారాలు పంపుతున్నప్పటికీ పాక్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, అయినప్పటికీ తాము ఈ సారి కూడా ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారత్ దీటుగా జవాబు ఇస్తూనే ఉందని చెప్పారు. అంతకు ముందు ఆమె జమ్మూలోని మిలటరీ హాస్పిటల్‌కి వెళ్లి సుంజువాన్ ఉగ్రదాడిలో గాయాలపాలైన వారిని కలిశారు. 

nirmala seetha raman
Pakistan
India
army
  • Error fetching data: Network response was not ok

More Telugu News