bike: బైక్‌పై వెళుతూ.. రహదారిలోని బారికేడ్లను లాక్కెళ్లిన 11 మంది యువకులు.. అరెస్ట్!

  • చెన్నైలో ఘటన
  • గతనెలలో రోడ్లపై యువకుల హల్‌చల్‌
  • ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా యువకులకు బుద్ధి చెప్పాలంటోన్న స్థానికులు

గత నెల చెన్నై రోడ్లపై హల్‌చల్ చేసిన 11 మంది యువకులపై కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు తాజాగా వారిని అరెస్ట్ చేశారు. అప్పట్లో వైరల్ అయిన వీడియో ద్వారా మొత్తం 11 మందిని గుర్తించామని పోలీసులు చెప్పారు. వారంతా నగరంలోని పలు కాలేజీ విద్యార్థులని చెప్పారు.

రోడ్డుపై ఉంచిన బారికేడ్లను విద్యార్థులు లాక్కెళుతుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వారు బారికేడ్లను లాక్కెళుతుండగా రోడ్డు రాపిడికి నిప్పురవ్వలు ఎగిశాయి. ఈ ఘటనపై అప్పట్లో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా యువకులకు బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.  

bike
chennai
Police
arrested
  • Error fetching data: Network response was not ok

More Telugu News