Uma Bharti: ఎన్నికల్లో ఇక పోటీ చేయను: బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి సంచలన నిర్ణయం

  • ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటన
  • వయోభారం, అనారోగ్యమే కారణమని వెల్లడి
  • పార్టీకి సేవలు కొనసాగుతాయని స్పష్టీకరణ

బీజేపీ 'అగ్గి బరాటా'గా పేరు తెచ్చుకున్న కేంద్రమంత్రి, సీనియర్ నాయకురాలు ఉమాభారతి భవిష్యత్తు ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. కానీ, పార్టీకి మాత్రం తన సేవలు కొనసాగుతాయని ఆమె ఆదివారం ఝాన్సీలో మీడియా ముఖంగా స్పష్టం చేశారు. వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా ఎన్నికల్లో పోటీ చేయరాదని తాను నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు.

ఇప్పటివరకు తాను రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేశానని, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, తన ఆరోగ్యం ప్రస్తుతం బాగోలేదని ఆమె అన్నారు. మోకాళ్లు, వెన్నునొప్పితో చాలా బాధపడుతున్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఝాన్సీ ఎంపీగా ఉన్న ఆమె గతంలో ఖజురహోకి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

Uma Bharti
BJP
Khajuraho
  • Loading...

More Telugu News