Padmaavat: ప్రేమికుల రోజు గురించి దీపిక ఏమందో తెలుసా...?

  • ప్రతిరోజునూ 'లవ్ డే'గా జరుపుకోవాలని ముద్దుగుమ్మ ఆకాంక్ష
  • విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తదుపరి చిత్రం
  • 'గల్లీ బాయ్' చిత్రంలో నటించనున్న ప్రియుడు రణ్‌వీర్

'పద్మావత్' చిత్రంతో కలెక్షన్ క్వీన్‌గా మారిన బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకునే ఈ నెల 14న జరుపుకోనున్న ప్రేమికుల రోజు గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది. ప్రేమికుల రోజుకు సంబంధించినంత వరకు, ప్రతి రోజు కూడా 'లవ్ డే'గా జరుపుకోవాలని తాను భావిస్తున్నట్లు తెలిపింది. తన తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా ఆమె వివరించింది.

విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందనున్న 'సప్నా దీదీ' చిత్రం కోసం తాను రెడీ అవుతున్నట్లు సెలవిచ్చిందీ నాజూకు భామ. ఎస్.హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందులో ప్రధాన పాత్రను దీపిక పోషించనున్నట్లు తెలిసింది. ఇర్ఫాన్ ఖాన్ ఇందులో విలన్‌గా కనిపించనున్నాడట.

ఇక దీపిక నటించిన పద్మావత్ చిత్రం ఇటు తెలుగులోనూ ఆదరణ పొందుతోంది. మరోవైపు తన ప్రియుడు రణ్‌వీర్ సింగ్ కూడా 'గల్లీ బాయ్' చిత్రం కోసం సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇందులో అతని సరసన హీరోయిన్‌గా క్యూట్ గర్ల్ ఆలియా భట్ నటించనుంది.

Padmaavat
Vishal Bhardwaj
Deepika Padukone
Sapna Didi
  • Loading...

More Telugu News