pooja hegde: టాలీవుడ్ లో ఏ హీరోయిన్ పారితోషికం ఎంతో తెలుసా?

  • హిట్ లేకున్నా దూసుకుపోతున్న పూజా హెగ్డే
  • కొత్త సినిమాకు రూ. 1.50 కోట్లు
  • రూ. 85 లక్షలు వసూలు చేస్తున్న కీర్తి సురేష్, సాయి పల్లవి

ఏ హీరోయన్ అయినా ఒక్క హిట్ పడిందంటే చాలు... పారితోషికాన్ని అమాంతం పెంచేస్తుంది. కానీ పూజా హెగ్డే రూటే వేరు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఈ అమ్మడు మూడు సినిమాలు చేసింది. ఈ మూడు సినిమాలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. అయినా పూజా కోసం దర్శక నిర్మాతలు వెంటపడుతున్నారు. ఈ నేపథ్యంలో, తన నాలుగవ సినిమా 'సాక్ష్యం'కు పూజా ఏకంగా రూ. 1.5 కోట్లు డిమాండ్ చేసిందట. వారు కూడా ఇంత మొత్తం ఇవ్వడానికి ఓకే చెప్పేశారు. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరోవైపు ఒక్కో సినిమాకు కీర్తి సురేష్ రూ. 85 లక్షలు, సాయి పల్లవి రూ. 85 లక్షలు, నివేదా థామస్ రూ. 70 లక్షలు, అనుపమ పరమేశ్వరన్ రూ. 60 లక్షలు, అను ఇమ్మాన్యుయేల్ రూ. 50 లక్షలు వసూలు చేస్తున్నారని సమాచారం. మహేష్ బాబు సరసన నటిస్తున్న కైరా అద్వానీ తన రెండో సినిమాను రామ్ చరణ్ తో చేయనుందట. ఈ సినిమా కోసం ఆమె రూ. 70 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం.  

pooja hegde
keerthi suresh
sai pallavi
Niveda Thomas
anupama parameswaran
anu immanuel
remuneration
  • Loading...

More Telugu News