Chiranjeevi: ఇళయరాజాను కలిసి 'సైరా' టీమ్ లో చేరాలని కోరిన చిరంజీవి!

  • స్వయంగా వెళ్లి ఇళయరాజాను కలిసిన చిరంజీవి
  • 'సైరా'కు మ్యూజిక్ డైరెక్టర్ గా చేయాలని కోరిక
  • అంగీకరించిన మ్యూజిక్ మ్యాస్ట్రో
  • వెలువడని అధికారిక ప్రకటన

తన 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' టీమ్ లో చేరాలని చిరంజీవి స్వయంగా వెళ్లి సంగీత దర్శకుడు ఇళయరాజాను కోరినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తొలుత సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ను తీసుకోగా, ఆ తరువాత ఆయన తప్పుకున్నాడు. తరువాత థమన్ 'సైరా' ఫస్ట్ లుక్ కు అద్భుత మ్యూజిక్ ఇచ్చాడు. అతని పేరు ఖరారవుతుందని భావించేంతలో తెరపైకి కీరవాణి వచ్చాడు.

ఇక ఇప్పుడు ఆయన పేరు కూడా పోయి, తాజాగా ఇళయరాజా పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల పద్మభూషణ్ పురస్కారానికి ఇళయరాజా ఎంపిక కాగా, ఆయన్ను అభినందించేందుకే చిరంజీవి వెళ్లారని కొందరు అంటుంటే, చారిత్రక నేపథ్యమున్న సినిమా కాబట్టి, బీజిఎం (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) కీలకమని, ఇళయరాజా అయితే బాగుంటుందని భావించిన చిరంజీవి ఆయన్ను కలిసి, ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇక ఇళయరాజా కూడా అంగీకరించారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

Chiranjeevi
Ilayaraja
Saira
  • Loading...

More Telugu News