Chandrababu: స్వాతంత్ర్యం కోసం పోరాడటం అప్పటి చరిత్ర.. ఇప్పటి చరిత్ర ఇదే: చంద్రబాబు

  • రాష్ట్రం కోసం పోరాటం చేయడం ఇప్పటి చరిత్ర
  • టీడీపీ ఎంపీల పోరాటం అద్భుతం
  • తప్పుడు లేఖలతో వైసీపీ అభివృద్ధిని అడ్డుకుంటోంది

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయడం అప్పటి చరిత్ర అయితే... ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటం ఇప్పటి చరిత్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్లమెంటు ఉభయసభల్లో టీడీపీ ఎంపీలు చేసిన పోరాటంతో, మన సమస్యల గురించి యావత్ దేశానికి తెలిసిందని చెప్పారు. దీనికి సంబంధించి, ఎంపీలకు అభినందనలు చెబుతున్నానని అన్నారు.

గత మూడున్నరేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి అన్నివిధాలా సహకరించామని... జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు అంశాలకు మద్దతు ఇచ్చామని చెప్పారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీని అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమంటే... రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడమేనని అన్నారు. ప్రతిపక్షం తప్పుడు లేఖలు రాస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోందని చెప్పారు. రాష్ట్రం కోసం పోరాడిన కేంద్ర మంత్రిపై కూడా ఫిర్యాదులు చేశారని, ఇది అత్యంత శోచనీయమని మండిపడ్డారు. ఉపాధి హామీ పనుల నిధులపై కూడా తప్పుడు ఫిర్యాదులు చేశారని... వైసీపీ అరాచకాలకు ఇది పరాకాష్ట అని చెప్పారు.

Chandrababu
Andhra Pradesh
parliament
Telugudesam mps
YSRCP
letters
  • Loading...

More Telugu News