KTR: సినిమాకు వెళ్లిన కేటీఆర్ పై విమర్శలు... కేటీఆర్ కౌంటర్!

  • 'తొలిప్రేమ' చిత్రాన్ని చూసిన తెలంగాణ ఐటీ మంత్రి
  • రైతుల కష్టాలను పక్కన బెట్టారని విమర్శలు
  • తన ఇష్టాయిష్టాలు తనకుంటాయని కౌంటరేసిన కేటీఆర్
  • ఇష్టం లేకుంటే అన్ ఫాలో కావాలని సలహా

ఇటీవల విడుదలైన 'తొలిప్రేమ' చిత్రాన్ని చూసి, అది బాగుందని మెచ్చుకున్న తరువాత తనపై వస్తున్న విమర్శలకు తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రైతుల కష్టాలను పక్కనబెట్టి, సినిమాలకు, షికార్లకు వెళ్లడం ఏంటని ట్విట్టర్ లో ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ విమర్శల జోరు పెంచారు.

దీనిపై స్పందించిన కేటీఆర్ తన డీపీని మార్చుకోవడంతో పాటు తన ఇష్టాయిష్టాలు తనకుంటాయని కీలక వ్యాఖ్య చేశారు. సినిమాలు చూసినా, డీపీలు మార్చుకున్నా తప్పేంటని ప్రశ్నించారు. ప్రజా జీవితంలో ఉన్నంత మాత్రాన, వ్యక్తిగత జీవితాన్ని వదిలేయాలా? అని అడిగారు. ఇష్టమైతేనే ట్విట్టర్ లో తనతో ఉండాలని, లేకుంటే తనను ఫాలో కావడం మానేయాలని సలహా ఇచ్చారు. తాను సినిమాకు వెళితే కొందరికి సమస్యగా ఎందుకు అనిపిస్తోందో అర్థం కావడం లేదన్నారు.

KTR
Toliprema
Twitter
Fallowers
  • Error fetching data: Network response was not ok

More Telugu News