Varun Tej: నా ముద్దు పేరు 'ఎదవ': వరుణ్ తేజ్

  • మా నాన్న ముద్దుగా అలానే పిలుస్తారు
  • ప్రస్తుతానికి ఒంటరినే
  • ప్రభాస్ కన్నా ఓ అంగుళం ఎత్తు ఎక్కువే 
  • ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్

రెండు రోజుల క్రితం తాను నటించిన 'తొలిప్రేమ' చిత్రం బాక్సాఫీసు వద్ద విజయాన్ని నమోదు చేసుకోగా, ఆ ఆనందంలో ఉన్న వరుణ్ తేజ్, ఓ ఆంగ్ల మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. తనకు ఇచ్చే పారితోషికంపై వ్యాఖ్యానిస్తే, ఐటీ సమస్యలు వస్తాయన్న ఆయన, చేసే సినిమాపై ఆధారపడి డబ్బు తీసుకుంటానని చెప్పాడు. యూసఫ్‌గూడలోని సెయింట్‌ మేరీస్‌ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌  చేసిన తాను ప్రస్తుతానికి ఒంటరిగానే ఉన్నానని, ఎవరైనా అమ్మాయి దొరికితే చెబుతానని అన్నాడు.

తన ముద్దుపేర్లపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, "నాన్న ఎదవ అని పిలుస్తుంటాడు. అమ్మ వరుణ్ బాబూ అంటుంది. ఇంకా చాలానే ముద్దుపేర్లున్నాయి" అని చెప్పాడు. ప్రభాస్ తనకు మంచి ఫ్రెండని, అతని కన్నా ఒక అంగుళం ఎక్కువ ఎత్తే ఉన్నానని అన్నాడు. తన వయసును దాచుకోబోనని 1990 జనవరి 19న పుట్టిన తనకిప్పుడు 28 ఏళ్లని చెప్పాడు. 'ఘాజీ' వంటి చిత్రాన్ని తీసిన సంకల్ప్ రెడ్డితో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఓ సినిమాలో నటిస్తున్నట్టు వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

Varun Tej
Prabhas
Toliprema
Interview
Nick Names
  • Loading...

More Telugu News