Tollywood: అందాలు చూపించాలని ముందే తెలుసు: హీరోయిన్ సమంత

  • సినిమా ఇండస్ట్రీ గ్లామర్ వరల్డ్
  • కథ డిమాండ్ చేస్తే గ్లామర్ గా కనిపించడం తప్పుకాదు
  • అనవసరంగా చూపించాలంటే మాత్రం అంగీకరించబోనన్న సమంత

సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ప్రపంచమన్న సంగతి తనకు ముందే తెలుసునని, ఇందులోకి ప్రవేశించిన తరువాత, అందాలు చూపించాల్సి వుంటుందని తెలిసే తాను వచ్చానని హీరోయిన్ సమంత వ్యాఖ్యానించింది. పెళ్లి తరువాత కూడా కెరీర్ ను కొనసాగిస్తున్న సమంత, తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో ముందుంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే.

తాజాగా సినీ జీవితం గురించి ఆమెను ప్రశ్నిస్తే, కథ డిమాండ్ చేస్తే, గ్లామర్ గా నటించడం తప్పేమీ కాదని, అయితే, అవసరం లేని చోట గ్లామర్ గా ఉండటం తనకు ఇష్టం ఉండదని చెప్పింది. భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే, ఏ వృత్తిలోనైనా కొనసాగవచ్చని అభిప్రాయపడింది. తాను చైతూతో గొడవలు పడుతూ ఉంటానని, ఆ తరువాత చైతూ బెట్టుతో తనతో మాట్లాడడని, ఆపై తానే మాట్లాడతానని కూడా చెప్పుకొచ్చింది సమంత. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో చేతినిండా సినిమాలతో ఉన్న సమంత, త్వరలోనే భర్త నాగ చైతన్య పక్కన నాలుగో చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Tollywood
samanta
Naga Chaitanya
Glamour World
  • Loading...

More Telugu News