Amrapali: ఫిబ్రవరి 23న ఆదివారమట... ఆమ్రపాలి పెళ్లి శుభలేఖలో అచ్చుతప్పు!

  • ఈనెల 18న జమ్మూ కాశ్మీర్ లో వివాహం
  • ఐపీఎస్ అధికారి సమీర్ తో పెళ్లి
  • 23న వరంగల్ లో 25న హైదరాబాద్ లో రిసెప్షన్

వరంగల్ కలెక్టర్ కాటా ఆమ్రపాలి రెడ్డి వివాహం ఈ నెల 18వ తేదీన గోవా ఐపీఎస్ ఆఫీసర్ సమీర్ శర్మతో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం జమ్మూ కాశ్మీర్ లో జరగనుండగా, ఆపై 23న వరంగల్ లో, 25న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటైంది. విందుకు ఆహ్వానం పలుకుతూ, పత్రికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. 23న జరిగే విందు ఆహ్వాన పత్రికలో శుక్రవారం బదులు ఆదివారం అని అచ్చు తప్పు పడింది. దీన్ని శుక్రవారంగా సరిచేస్తూ స్టిక్కర్ వేసి ఆహ్వానాలను అందిస్తున్నారు.

శ్రీమతి పద్మావతి, ప్రొఫెసర్ కాటా వెంకటరెడ్డిల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ఆమ్రపాలి వివాహం శ్రీమతి సంతోష్, లెఫ్టినెంట్ కల్నల్ ఆర్కే శర్మ (రిటైర్డ్) కుమారుడు చిరంజీవి సమీర్ తో జరుగుతుందని పెళ్లి పత్రికల్లో ప్రచురించారు. హనుమకొండలోని సుబేదారి ప్రాంతంలో ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 23న సాయంత్రం 6 గంటల నుంచి రిసెప్షన్ సాగనుంది.

Amrapali
IAS
IPS
Reception
  • Loading...

More Telugu News