anchor shyamala: నా ఫేస్ ను మార్ఫింగ్ చేసి, బూతు వీడియోను ఇంటర్నెట్ లో పెట్టారు: యాంకర్ శ్యామల

  • సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదుర్కొన్న శ్యామల
  • నీలి చిత్రంలో మోడల్ ఫేస్ మార్ఫింగ్
  • నా భర్త నన్ను అర్థం చేసుకున్నారన్న యాంకర్

నిండైన వస్త్రధారణ, అసభ్యతకు తావు లేకుండా ఓ ఈవెంట్ ను హోస్ట్ చేయడంలో యాంకర్ శ్యామలకు మంచి పేరు ఉంది. అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తూ మంచి నటిగా గుర్తింపు పొందింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆమె పొందిన చేదు అనుభవం గురించి చెప్పింది.

ఓ బ్లూ ఫిల్మ్ లో నటించిన ఓ మోడల్ ఫేస్ కు తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి, ఆ వీడియోను ఇంటర్నెట్ లో పెట్టారని చెప్పింది. అయితే, ఆ వీడియోను అప్ లోడ్ చేసిన వెబ్ సైట్ వారితో మాట్లాడి, వీడియోను తొలగించామని తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియోను తన భర్త తనకు షేర్ చేసేంత వరకు తెలియదని చెప్పింది. నా భర్త కూడా ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తే కావడంతో, ఆ వీడియోను లైట్ తీసుకున్నాడని... ఇలాంటివి సహజమే అంటూ పట్టించుకోలేదని తెలిపింది.

తన భర్త తనను అర్థం చేసుకోకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తలచుకుంటేనే భయం వేస్తుందని చెప్పింది. దూరంగా ఉన్న వ్యక్తులను దగ్గర చేయడానికి సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతుందని... ఇదే సమయంలో, చెడు విషయంలో దీని అంత దరిద్రమైంది కూడా మరేదీ లేదని తెలిపింది.

anchor shyamala
Social Media
tollywood
  • Loading...

More Telugu News