Telangana: పాతబస్తీలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

  • 11న దారుస్సలాంలో ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు సమావేశం
  • నాంపల్లి ఎగ్జిబిషన్ చివరి రోజు రేపు
  • రద్దీగా మారనున్న పాతబస్తీ రోడ్లు

ఈ నెల 11న ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సమావేశాన్ని పురస్కరించుకుని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 11న దారుస్సలాంలో ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సమావేశాలు జరగనున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల ప్రముఖులు హైదరాబాదు రానున్నారని, అదే రోజు నాంపల్లి ఎగ్జిబిషన్‌ చివరి రోజు కావడంతో స్థానికులు పోటెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని తెలిపారు.

దీంతో పాతబస్తీ పరిసరాల్లో స్థానికులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించామని చెప్పారు. వాహనాల కోసం గోషామహల్‌ స్టేడియం, నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్ లలో ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. వివిధ ప్రాంతాల్లో మార్గాల సూచిక బోర్డులను ఏర్పాటు చేశామని చెప్పారు. 

Telangana
Hyderabad
old city
traffic rules
  • Loading...

More Telugu News