Tamannaah: బూటు విసిరిన ఘటనపై స్పందించిన తమన్నా!

  • కరీముల్లా తీరుపై ఎలా స్పందించాలో తెలియడం లేదు
  • ప్లాన్ ప్రకారం దాడి చేయాలని వచ్చినట్టున్నాడు
  • అతని ప్రవర్తనపై ఎలా స్పందించాలో తెలియడం లేదు

హైదరాబాదులోని ఒక నగల దుకాణ ప్రారంభోత్సవం సమయంలో తమన్నాపై కరీముల్లా అనే వ్యక్తి బూటు విసిరిన సంగతి తెలిసిదే. దీనిపై తమన్నా స్పందించింది. కొంతమంది గిరి గీసుకుని ఉంటారని, ఆ గీత దాటి ప్రపంచం ఉందని భావించరని, వారి చర్యలతో ఇతరులు ఇబ్బంది పడతారని కూడా ఆలోచించరని చెప్పింది. కరీముల్లా అలాంటి వ్యక్తేనని తెలిపింది.

ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారని, తన విషయంలో కూడా అతని స్పందన అలాంటిదేనని తమన్నా చెప్పింది. ప్లాన్ ప్రకారం అతను అక్కడికి వచ్చినట్టు ఉన్నాడని ఆమె అభిప్రాయపడింది. తాను ఎక్కువ సినిమాలు చేయడం లేదని అతనలా చేశాడని విన్నానని, దానికెలా స్పందించాలో తెలియడం లేదని పేర్కొంది. కాగా, కరీముల్లాను అరెస్టు చేసి విచారించగా, తమన్నా ఎక్కువ సినిమాలు చేయడం లేదని బూటు విసిరి నిరసన తెలిపానని పోలీసులకు చెప్పినట్టు తెలిసిందే. 

Tamannaah
kareemulla
shoe through incident
  • Loading...

More Telugu News