Niharika: హీరో నాగశౌర్య గురించి మెగా హీరోయిన్ స్పందన!

  • నాగశౌర్య నాకు మంచి స్నేహితుడు మాత్రమే
  • ఇంతకు మించి మా మధ్య మరేదీ లేదు
  • నా కజిన్స్ తో ముడిపెట్టి కూడా వార్తలు రాశారు

మెగా హీరోయిన్ నిహారిక తనదైన శైలితో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఆమె తమిళంలో ఓ సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు ఎక్కడకు వెళ్లినా ఈమెకు లవ్ ఎఫైర్ల గురించిన ప్రశ్నలు ఎదురవుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరో నాగశౌర్యతో పెళ్లి గురించి ప్రశ్నలను ఎక్కువగా అడుగుతున్నారు. ఈ ప్రశ్నలపై తాజాగా ఆమె స్పందించింది.

మిగిలిన కో-ఆర్టిస్టుల్లానే నాగశౌర్య కూడా తనకు ఒక మంచి మిత్రుడని నిహారిక చెప్పింది. దీనికి మించి తమ మధ్య మరేదీ లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు నాగశౌర్యకు, తనకు లింక్ పెట్టారని, ఇంతకు ముందు వేరొకరితో లింక్ పెట్టారని చెప్పింది. చివరకు తన కజిన్స్ తో కూడా ముడిపెట్టి వార్తలు రాశారని ఆవేదన వ్యక్తం చేసింది. మొదట్లో ఇలాంటి వార్తలతో తనకు బాధ అనిపించేదని, ఇప్పుడు అలవాటై పోయిందని చెప్పింది. 

Niharika
naga shourya
love
Tollywood
  • Loading...

More Telugu News