charan: 'రంగస్థలం' షూటింగుకి గుమ్మడికాయ కొట్టేస్తున్నారు

  • స్పెషల్ సాంగ్ చేసిన పూజా హెగ్డే 
  • చిత్రీకరణ పూర్తి చేసిన సుకుమార్ 
  • మార్చి 30వ తేదీన విడుదల

చరణ్ .. సమంత ప్రధాన పాత్రలుగా సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' సినిమా రూపొందుతోంది. ఇంతకుముందు 'చిట్టిబాబు'గా చరణ్ పాత్రకి సంబంధించిన టీజర్ ను వదిలిన ఈ సినిమా టీమ్, కొంతసేపటి క్రితం 'రామలక్ష్మి'గా సమంత పాత్రకి సంబంధించిన టీజర్ ను వదిలింది. వాస్తవానికి ఈ సినిమా షూటింగు నవంబర్ నాటికే పూర్తి కావలసింది .. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావలసింది. అయితే కొన్ని కారణాల వలన ఆలస్యం అయింది.

 రీసెంట్ గా ప్లాన్ చేసిన చివరి షెడ్యూల్ లో పూజా హెగ్డేపై స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ రోజు .. రేపు ప్యాచ్ వర్క్ ను పూర్తి చేసి, ఆదివారం రోజున గుమ్మడికాయ కొట్టేయనున్నారు. మార్చి మొదటి వారంలో ఆడియో ఫంక్షన్ ను నిర్వహించి .. మూడవ వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపి, మార్చి 30వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. 

  • Loading...

More Telugu News