charan: సమంత పాత్రను పరిచయం చేస్తూ 'రంగస్థలం' నుంచి టీజర్ రిలీజ్

  • పల్లె పిల్ల పాత్రలో ఆకట్టుకుంటోన్న సమంత 
  • రామలక్ష్మి పాత్రలో ఇమిడిపోయింది
  • హైలైట్ కానున్న ఆమె పాత్ర  

ముందుగా చెప్పినట్టుగానే 'రంగస్థలం' సినిమా నుంచి కొంత సేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు. సమంత పాత్రను పరిచయం చేస్తూ ఈ టీజర్ మొదలైంది. సమంత పాత్ర గురించి చరణ్ పాత్ర చెబుతూ ఉండగా, ఆమె విజువల్స్ పై ఈ టీజర్ కొనసాగింది. పల్లె పడుచులా సమంత  బిందె చంకనబెట్టుకుని గోదావరి వైపు నడుస్తూ కనిపిస్తుంది.

 పల్లె పిల్లలా ఆమె తన పనులు చేసుకుంటూ ఉండగా, "ఓహోహో ఏం వయ్యారం .. ఏం వయ్యారం .. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలిగానండీ .. ఈ పిల్లను చూస్తుంటే మా ఊరికే 18 సంవత్సరాల వయసు వచ్చినట్టు ఉంటదండీ. ఈ చిట్టిగాడి గుండెకాయను గోలెట్టించేసింది ఈ పిల్లేనండీ. పేరు రామలక్ష్మి అండీ .. ఊరు 'రంగస్థలం' అంటూ చరణ్ వాయిస్ పై ఈ టీజర్ పూర్తయింది. పల్లె పిల్ల పాత్రలో సమంత ఇమిడిపోయిన తీరు టీజర్ లో కనిపిస్తోంది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందనే విషయం, ఈ టీజర్ ను బట్టే అర్థమైపోతోంది.

  • Loading...

More Telugu News