www.indiareserveban.org: ఆ వెబ్ సైట్ ను నమ్మనే నమ్మొద్దు: ఆర్బీఐ హెచ్చరిక

  • 'ఇండియన్ రిజర్వ్ బ్యాన్' పేరిట వెబ్ సైట్
  • ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న సైట్
  • ఎటువంటి బ్యాంకు వివరాలనూ వెల్లడించకండి
  • ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట ఓ నకిలీ వెబ్ సైట్ ప్రారంభమై ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతోందని, 'ఇండియన్ రిజర్వ్ బ్యాన్ డాట్ ఓఆర్జీ' (www.indiareserveban.org) పేరిట అది నడుస్తోందని ఆర్బీఐ ఓ ప్రకటనలో హెచ్చరించింది. ఈ వెబ్ సైట్ ను నమ్మరాదని పేర్కొంది. ఖాతాదారుల నుంచి వివరాలను సేకరిస్తున్న ఈ వెబ్ సైట్ పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఈ వెబ్ సైట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, దీనికి బ్యాంకు ఖాతాదారులు ఎవరూ తమ తమ బ్యాంకు వివరాలను వెల్లడించరాదని సూచించింది. తాము సైబర్ పోలీసుల విభాగానికి ఫిర్యాదు చేశామని వెల్లడించింది.

ఆర్బీఐ ఎన్నడూ వినియోగదారుల వివరాలను అడగబోదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని కోరింది. ఈ వెబ్ సైట్ హోమ్ పేజీ ఆర్బీఐ వెబ్ సైట్ హోమ్ పేజీని పోలి ఉండటంతోనే ఖాతాదారులు సులువుగా మోసపోతున్నారని అభిప్రాయపడింది. ఇదిలావుండగా, 2016 నవంబర్ లో పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత, రిజర్వ్ బ్యాంక్ పేరిట ఆన్ లైన్ మోసం చేసే ముఠాలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. క్రెడిట్ కార్డుల జారీ, యాప్ ద్వారా నగదు బదిలీ పేరిట కొన్ని కోట్ల రూపాయల డబ్బును ఇవి దోపిడీ చేశాయి. వీటిల్లో ఎన్నో కేసులింకా పెండింగ్ లో ఉన్నా, ఎప్పటికప్పుడు నకిలీ వెబ్ సైట్లు పుట్టుకొస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News