Bangladesh: విరాళాలను దుర్వినియోగం చేసిన బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలు శిక్ష!
- గతంలో రెండు సార్లు బంగ్లాదేశ్‌కి ప్రధానిగా పనిచేసిన బేగం ఖలేదా జియా
- 1,62,00,000 రూపాయలను దుర్వినియోగం చేసిన వైనం
- జియా కుమారుడితో పాటు మరో నలుగురికి 10 సంవత్సరాల జైలు శిక్ష
విదేశాల నుంచి విరాళంగా జియా చారిటబుల్ ట్రస్ట్‌కు వచ్చిన నిధులను వినియోగించుకున్నట్లు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు బేగం ఖలేదా జియాపై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో ఆమెకు ఐదేళ్ల శిక్ష విధిస్తున్నట్లు అక్కడి ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది.
ఆమె గతంలో రెండు సార్లు బంగ్లాదేశ్‌కి ప్రధానిగా పనిచేశారు. ఆమె చిన్నపిల్లల చారిటబుల్ ట్రస్ట్ కోసం వినియోగించాల్సిన 1,62,00,000 రూపాయలను దుర్వినియోగం చేశారు. కాగా, ఈ కేసులో మరో దోషి జియా కుమారుడు తారిఖ్ రెహమాన్ తో పాటు మరో నలుగురికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది.