ram gopal varma: షూటింగ్ బిజీ వల్ల విచారణకు రాలేనన్న వర్మ... మరోసారి నోటీసులు ఇవ్వనున్న సీసీఎస్ పోలీసులు!

  • నేడు సీసీఎస్ పోలీసుల ముందు హాజరు కావాల్సిన వర్మ
  • ముంబైలో బిజీగా ఉన్నానంటూ లాయర్ ద్వారా సమాచారం పంపిన వర్మ
  • వచ్చే వారం మళ్లీ నోటీసు ఇస్తే వస్తానన్న దర్శకుడు

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే, జీఎస్టీ సినిమా చర్చ సమయంలో తనపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ వర్మపై సామాజిక కార్యకర్త దేవి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నేడు సీసీఎస్ పోలీసుల ముందు వర్మ హాజరు కావాల్సి ఉంది. ఈ సాయంత్రం 6 గంటలలోపు ఆయన సీసీఎస్ కార్యాలయానికి రావాల్సి ఉంది.

అయితే, ముంబైలో షూటింగ్ లో బిజీగా ఉన్న వర్మ... ఈ నోటీసులను తీసుకోలేదు. ఈ నేపథ్యంలో, షూటింగ్ బిజీ వల్ల విచారణకు హాజరు కాలేనంటూ తన లాయర్ ద్వారా సీసీఎస్ పోలీసులకు వర్మ సమాచారం ఇచ్చాడు. వచ్చే వారం మళ్లీ నోటీసులు ఇస్తే, విచారణకు హాజరవుతానని వర్మ తెలిపాడు. ఈ నేపథ్యంలో, వర్మకు మళ్లీ నోటీసులు ఇవ్వడానికి సీసీఎస్ పోలీసులు సిద్ధమయ్యారు. ఆ నోటీసుకు కూడా వర్మ రాకపోతే, అరెస్ట్ వారెంట్ జారీ చేసే యోచనలో అధికారులు ఉన్నారని సమాచారం. 

ram gopal varma
gst
ccs police
  • Loading...

More Telugu News