Pooja Hegde: 'జిల్ జిల్ జిగేల్...' అంటూ రూ. 50 లక్షలు పుచ్చుకుంటున్న పూజా హెగ్డే!

  • రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
  • స్పెషల్ సాంగ్ చేసేందుకు అంగీకరించిన పూజా హెగ్డే
  • ఇంకా వెలువడని అధికారిక ప్రకటన

ఒకప్పుడు సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు హీరోయిన్స్ అంగీకరించేవాళ్లు కాదుగానీ, ట్రెండ్ మారి, ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటే పేరున్న హీరోయిన్స్ కూడా అంగీకరించేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో పూజా హెగ్డే కూడా చేరిపోయింది. రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగస్థలం' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో పూజ హెగ్డే డ్యాన్స్ చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె రూ. 50 లక్షలు తీసుకోనుందన్న ప్రచారమూ జరుగుతోంది.

సుకుమార్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ కు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అందునా రామ్ చరణ్ పక్కన అనేసరికి ఎగిరి గంతేసి ఒప్పుకుందట. "జిల్ జిల్ జిగేల్..." అంటూ ఈ పాట సాగుతుందని, ఇప్పటికే క్రేజీ ఆఫర్స్ ను తన ఖాతాలో వేసుకున్న ఆమె, మరో క్రేజీ ప్రాజెక్టులో భాగమైందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  

Pooja Hegde
Ramcharan
Sukumar
New Movie
Special Song
  • Loading...

More Telugu News