Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ కూతురి పేరుతో అభ్యంతరకర పోస్టులు...టెకీ అరెస్టు

  • సారా టెండూల్కర్ పేరిట ట్విట్టర్ ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసిన టెకీ
  • సారా పేరుతో శరద్ పవార్ కు ట్వీట్
  • నితిన్ సిశోడేను అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైం పోలీసులు

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ పేరిట ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసి, అసభ్య పోస్టులు చేసే సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ నితిన్ షిశోడేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని అంధేరీలో నివాసముండే నితిన్.. సెలబ్రిటీలు, వారి కుమార్తెల పేరిట ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు రూపొందించి, తప్పుడు కామెంట్లు పెడుతుంటాడని పోలీసులు తెలిపారు. సారా, అర్జున్ టెండూల్కర్ లకు సోషల్ మీడియా అకౌంట్లు లేవని, అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ సచిన్ ఫిర్యాదు చేశారు.

 దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు నితిన్ ను అదుపులోకి తీసుకున్నారు. సారా పేరిట క్రియేట్ చేసిన ఫేక్‌ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ పై అభ్యంతరకరమైన పోస్ట్‌ లు చేసినట్లు సైబర్ విభాగం పోలీసులు గుర్తించారు. 2014లో సారా, అర్జున్ ట్విట్టర్ లో లేరని, వారి పేర్లతో ఉన్న ట్విట్టర్ అకౌంట్లను విశ్వసించవద్దని చెబుతూ సచిన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. 

Sachin Tendulkar
sara tendulkar
fake social media accounts
  • Loading...

More Telugu News