sai dharam tej: అందుకే వినాయక్ నా పాత్రకి 'ధర్మాభాయ్' అనే పేరు పెట్టారు!

  • రేపే ప్రేక్షకుల ముందుకు 'ఇంటిలిజెంట్'
  • మైండ్ గేమ్ తో కొనసాగే కథ 
  • కథానాయికగా లావణ్య త్రిపాఠి  

వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'ఇంటిలిజెంట్' .. రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ .. ధర్మాభాయ్ పాత్రలో కనిపించనున్నాడు. తన పాత్రకి వినాయక్ ఈ పేరు పెట్టడం గురించి సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. చాలావరకూ హీరోల ఒరిజినల్ పేర్లే పాత్రలకి పెట్టడానికి వినాయక్ ప్రయత్నిస్తూ వుంటారు. అలా 'నాయక్' సినిమాలో చరణ్ పాత్రకి 'చెర్రీ' అనీ .. 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో చిరూ పాత్రపేరు 'శంకర్' అని పెట్టారు.

అలాగే నా సినిమాలో నా పేరులోని 'ధరమ్' తో మొదలయ్యేలా 'ధర్మాభాయ్' అని పెట్టారు. మొదట్లో ఈ సినిమాకి ఈ టైటిల్ నే పెడదామని అనుకున్నాం. కానీ కథ అంతా కూడా మైండ్ గేమ్ తో నడుస్తుంది. అందువలన 'ఇంటిలిజెంట్' టైటిల్ కరెక్ట్ అనుకుని దానినే ఫిక్స్ చేశామని చెప్పాడు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, లావణ్య త్రిపాఠి కథానాయికగా అలరించనున్న సంగతి తెలిసిందే.      

sai dharam tej
lavanya tripathi
  • Loading...

More Telugu News