Gali Muddu Krishnama Naidu: చివరి క్షణాల్లో గాలి ముద్దుకృష్ణమ అడిగింది ఇతని గురించే!

  • రెండు దశాబ్దాలుగా గాలికి సేవ చేసిన చంద్ర
  • మరణించే ముందు అతన్ని పిలిపించాలని కోరిన గాలి
  • చంద్ర వచ్చేసరికే అపస్మారక స్థితిలోకి
  • బోరున విలపించిన చంద్ర

తానిక ఎక్కువ కాలం బతకలేనని తెలిసిపోయిందో ఏమో, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, తన చివరి క్షణాల్లో ఒకే ఒక్క వ్యక్తి గురించి అడిగాడు. అతను ఎవరో కాదు. గడచిన 20 సంవత్సరాలుగా తన వాహన డ్రైవర్ గా, వ్యక్తిగత సహాయకుడిగా, నమ్మినబంటుగా ఉన్న చంద్ర. గాలి ముద్దుకృష్ణమనాయుడితో రెండు దశాబ్దాల పాటు నడిచిన చంద్రే, గతవారం జ్వరంతో ఉన్న ఆయన్ను రేణిగుంట విమానాశ్రయానికి తీసుకెళ్లి హైదరాబాద్ విమానం ఎక్కించారు.

ఆపై గాలి, హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చేరి డెంగ్యూ జ్వరానికి చికిత్స పొందుతున్న వేళ, పరిస్థితి విషమించింది. ఆ సమయంలో తన కుటుంబీకులతో చంద్రను పిలిపించాలని, వాడిని చూడాలని ఉందని గాలి చెప్పారట. విషయాన్ని చంద్రకు చేరవేసిన బంధువులు, అతన్ని హుటాహుటిన మంగళవారం నాడు హైదరాబాద్ కు రప్పించారు. అప్పటికే గాలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆయన్ను చూసిన చంద్ర కుదేలయ్యాడు. ఆయన మరణించిన తరువాత "అయ్యా... లే అయ్యా... నీ కోసం ఎంత మంది వచ్చారో చూడయ్యా" అంటూ చంద్ర విలపిస్తుండటం పలువురి హృదయాలను ద్రవింపజేసింది.

Gali Muddu Krishnama Naidu
Care Hospital
Chandra
Died
  • Loading...

More Telugu News