Narendra Modi: తనపై మోదీ చేసిన వ్యాఖ్యలకు మండిపడుతున్న రేణుకా చౌదరి!

  • ప్రధాని నాపై వ్యక్తిగత విమర్శలు చేశారు
  • అలాంటి వ్యక్తి నుంచి ఇంకేమి ఆశించగలం?
  • ఆ స్థాయికి దిగజారి నేను సమాధానం చెప్పలేను
  • ఈ వ్యాఖ్యల ద్వారా మహిళలను కించపరిచారు : రేణుకా చౌదరి

రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ తనపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి మండిపడుతున్నారు. రాజ్యసభ ముగిసిన అనంతరం, ఈ విషయమై ప్రశ్నించిన మీడియాతో రేణుక మాట్లాడుతూ, ‘ప్రధాని నాపై వ్యక్తిగత విమర్శలు చేశారు. అలాంటి వ్యక్తి నుంచి ఇంకేమి ఆశించగలం? ఆ స్థాయికి దిగజారి నేను సమాధానం చెప్పలేను. ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యాఖ్యల ద్వారా మహిళలను కించపరిచారు’ అని మండిపడ్డారు.

కాగా, ‘కాంగ్రెస్ లేని భారత్ నినాదం’ తనది కాదంటూ రాజ్యసభలో నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రేణుకా చౌదరి సహా కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, ప్రధాని మోదీ ప్రసంగానికి ఆటంకం కలిగించొద్దని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వారించారు. ఆ తర్వాత మోదీ ప్రసంగం వింటున్న రేణుక బిగ్గరగా నవ్వడంతో.. ‘రామాయణం’లో తర్వాత ఈ రకమైన నవ్వును వినే అవకాశం ఈరోజు లభించిందంటూ రేణుకా చౌదరిని ఉద్దేశించి మోదీ అనడం జరిగింది. 

Narendra Modi
renuka chowdary
  • Loading...

More Telugu News