Narendra Modi: ప్రాజెక్టులను అప్పట్లోనే పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది: రాజ్యసభలో మోదీ

  • వేలకోట్ల ఖర్చుతోనే ప్రాజెక్టులు పూర్తయ్యేవి
  • ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు లక్షల కోట్లు కావాలి
  • రైల్వే బడ్జెట్‌లో కొత్త పథకాలు ప్రకటించేవారు
  • వాటి అమలును పట్టించుకునే వారు కాదు

దేశంలో పలు ప్రాజెక్టులను అప్పట్లోనే పూర్తి చేసి ఉంటే వేలకోట్ల ఖర్చుతోనే అవి పూర్తయ్యేవని, ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు లక్షల కోట్లు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో రైల్వే బడ్జెట్‌లో కొత్త పథకాలు ప్రకటించేవారని, వాటి అమలును పట్టించుకునే వారు కాదని అన్నారు. అలాగే రైల్వే బడ్జెట్‌లో కొత్త పథకాలు ప్రకటించేవారని, వాటి అమలును పట్టించుకునే వారు కాదని తెలిపారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 1500 పైగా రైల్వే ప్రాజెక్టులను ప్రకటించిందని, పనులను మాత్రం ప్రారంభించలేదని విమర్శించారు. ఇప్పుడు తాము చేపడుతోన్న స్వచ్ఛ భారత్, యోగా దినోత్సవాన్ని ఎగతాళి చేస్తున్నారని తెలిపారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ఆమోదించాలని అన్నారు. ట్రిపుల్ తలాక్ పై కాంగ్రెస్‌కు ఎలాంటి చట్టం కావాలని ప్రశ్నించారు. ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతోన్న ఆధార్ కార్డు ఐడియా తమదేన‌ని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోందని, ఒక్క‌సారి 1998లో రాజ్యసభలో ఎల్‌కే అద్వానీ చేసిన ప్రసంగం వింటే ఆధార్ కార్డు తేవాలన్న ఆలోచన ఎలా పుట్టిందో తెలుస్తుందని చెప్పారు. అలాగే, తాము ఒకే ర్యాంకు ఒకే పించన్‌పై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News