Andhra Pradesh: గాలి ముద్దు కృష్ణమనాయుడి మృతి జీర్ణించుకోలేనిది: సీఎం చంద్రబాబు

  • ముద్దుకృష్ణమనాయుడి భౌతికకాయాన్ని సందర్శించిన చంద్రబాబు
  • ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి 
  • అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించేవారన్న అధినేత

గాలి ముద్దుకృష్ణమనాయుడి మృతి జీర్ణించుకోలేనిదని సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామపురంలో ముద్దుకృష్ణమ నాయుడి భౌతికకాయాన్ని సందర్శించి, ముఖ్యమంత్రి నివాళులర్పించారు. గాలి ముద్దు కృష్ణమనాయుడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తన చివరి రోజుల్లో ముద్దుకృష్ణమనాయుడు అనారోగ్యంతో బాధపడ్డారని అన్నారు. ఏమాత్రం సమయం దొరికినా ప్రజలతో మమేకమయ్యే వ్యక్తి ముద్దుకృష్ణమనాయుడని, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపించేవారని అన్నారు.

Andhra Pradesh
Gali Muddu Krishnama Naidu
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News