ansuya: అనసూయ హర్టయింది... సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసింది?

  • సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైన అనసూయ
  • నెటిజన్ల ఆగ్రహంతో హర్టయింది 
  • ఫేస్ బుక్, ట్విట్టర్ కు గుడ్ బై

ప్రముఖ యాంకర్‌, సినీ నటి అనసూయ మనసు గాయపడింది. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ దానికి గుడ్‌ బై చెప్పేసింది. కాగా, తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన బాలుడి ఫోన్ పగుల గొట్టిందని, దుర్భాషలాడిందని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై బాధిత మహిళ, అనసూయపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సోషల్ మీడియా మాధ్యమంగా దానిపై వివరణ ఇచ్చేందుకు అనసూయ ప్రయత్నించింది.  

అయితే, అనసూయ దురుసు వ్యవహారశైలికి సాక్షిని అంటూ ఒక యువకుడు అదే సమయంలో ముందుకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను తీవ్రస్థాయిలో విమర్శించారు. నెటిజన్ల ఆగ్రహానికి గురైన అనసూయ మనస్తాపంతో తన సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్‌ చేసింది. ట్వీట్టర్‌ తో పాటు ఫేస్‌ బుక్‌ లో కూడా అనసూయ అకౌంట్స్ కనిపించడం లేదు. నెటిజన్ల విమర్శలు తట్టుకోలేక ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ansuya
Social Media
trolling
  • Loading...

More Telugu News