Chandrababu: రాజ్ నాథ్ ముందు బెట్టువీడలేదు... స్పష్టంగా తన ఉద్దేశాన్ని చెప్పిన చంద్రబాబు!

  • ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది
  • అన్యాయం జరిగిందని అందరూ ఆగ్రహంగా ఉన్నారు
  • ఎంపీలతో మాట్లాడి విషయం చెబుతా
  • రాజ్ నాథ్ తో చంద్రబాబు

విభజన హామీలను అమలు చేస్తామని, పార్లమెంట్ లో ఎంపీల ఆందోళన విరమించాలని కొద్దిసేపటి క్రితం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేయగా, ఏ మాత్రం బెట్టువీడని చంద్రబాబు, తన మనసులోని ఉద్దేశాన్ని ఆయన ముందు స్పష్టం చేశారు. విభజన జరిగి నాలుగేళ్లయిన తరువాత కూడా రాష్ట్రానికి న్యాయం జరగడం లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అది ఇరు పార్టీలకూ మంచిది కాదని ఆయన అన్నట్టు సమాచారం. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే ఎంపీలు ఆందోళన చేస్తున్నారని, తాము కోరుతున్నది రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడమేనని చంద్రబాబు వెల్లడించారు. ఎంపీలతో తాను మరోసారి మాట్లాడాల్సి వుందని, ఆ తరువాతే ఏ విషయం మీకు తెలియజేస్తానని చంద్రబాబు చెప్పారు.

Chandrababu
Rajnath Singh
Phone Call
  • Loading...

More Telugu News