Gali Muddu Krishnama Naidu: ముద్దన్న ఇక కనిపించరంటే బాధేస్తోంది!: కన్నీరు పెట్టిన ఎల్.రమణ

  • పది రోజుల క్రితం కూడా మాట్లాడా
  • ఇప్పుడు చనిపోయారంటే నమ్మలేకున్నా: రమణ
  • నివాళులు అర్పించిన తుమ్మల, రావుల, హరికృష్ణ

పది రోజుల క్రితం కూడా తనతో మాట్లాడిన గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇక మాట్లాడరు, కనిపించరంటే చాలా బాధగా ఉందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం గాలి భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తన జీవితంలోని దురదృష్టకరమైన రోజుల్లో ఇది కూడా ఒకటని చెబుతూ కంటతడి పెట్టారు.

ఆయన్ను ప్రేమగా ముద్దన్నా అని పిలుచుకుంటామని, అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజా సమస్యలపై స్పందించే గుణం ఆయన సొంతమని అన్నారు. ఆయన లేరన్న విషయాన్ని ఇంకా నమ్మలేకున్నానని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో తనవంటి వారిని ఆయన ఎంతో ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. కాగా, రావుల చంద్రశేఖర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, హరికృష్ణ తదితరులు ఆయనకు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

Gali Muddu Krishnama Naidu
L Ramana
Harikrishna
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News