YSRCP: పార్లమెంట్ లో ఎలాంటి రాజకీయం నడుస్తోందో అర్థం కావట్లేదు!: ఎంపీ మిథున్ రెడ్డి

  • ఎన్డీఏ భాగస్వామి టీడీపీ ఇప్పుడా నిరసనలు వ్యక్తం చేసేది?
  • నాలుగేళ్లుగా ఏం చేసింది?
  • పార్టీ మారిన వారిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ మండిపడ్డ మిథున్ రెడ్డి

ఏపీకి అన్యాయం జరిగిందంటూ లోక్ సభలో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేయడంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ లో ఎలాంటి రాజకీయం నడుస్తోందో తనకు అర్థం కావట్లేదని అన్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ
ఇప్పుడా నిరసనలు వ్యక్తం చేసేది? నాలుగేళ్లుగా ఏం చేసింది? అని ప్రశ్నించారు.

లోక్ సభలో ఏపీ రాజకీయ అంశాలను ప్రస్తావించిన ఆయన, వైసీపీ గుర్తుపై గెలిచిన వారు ఏపీ కేబినెట్ లో కొనసాగుతున్నారని విమర్శించారు. పార్టీ మారిన వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ మూడున్నరేళ్లుగా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News