: నిలకడగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం
నిన్న లాహోర్ లో ఎన్నికల ర్యాలీలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ మాజీ క్రికెటర్, తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉంది. సభా వేదికపై వెళుతుండగా ఫోర్క్ లిఫ్ట్ కూలి ఆయన తలకు గాయాలయ్యాయి. 10కి పైగా కుట్లు పడ్డాయని సమాచారం. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, ప్రమాదమేమీ లేదని ఇమ్రాన్ ప్రతినిధి ఇజాజ్ చౌదరి మీడియాకు తెలిపారు.