nagar koti: వాళ్లిద్దరే నాకు స్పూర్తి: భవిష్యత్ ఆశాకిరణం నాగర్ కోటి

  • భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి నా అభిమాన ఆటగాళ్లు
  • వారిద్దనీ నిశితంగా గమనిస్తాను
  • జట్టు కష్టకాలంలొ ఉన్నప్పుడు వారెలా బౌలింగ్ చేస్తున్నారన్నది చూస్తా

బౌలింగ్ లో టీమిండియా ఆటగాళ్లు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమిలే తనకు స్పూర్తి అని వరల్డ్ కప్ గెలిచిన భారత అండర్-19 జట్టు సభ్యుడు నాగర్ కోటి తెలిపాడు. భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడుతూ, తనకు వేగంగా బంతులేయడమే లక్ష్యం కాదని చెప్పాడు. సందర్భానికి తగినట్టుగా బంతులేసి, జట్టు విజయంలో భాగమవ్వాలని కోరుకుంటానని అన్నాడు.

తాను బౌలింగ్‌ చేసే సమయంలో భువనేశ్వర్‌ కుమార్‌, మహమ్మద్‌ షమిని దృష్టిలో ఉంచుకుంటానని చెప్పాడు. వారిని నిశితంగా గమనిస్తానని అన్నాడు. చిత్రం ఏంటంటే తానిప్పటి వరకు వారిని కలిసిందే లేదని అన్నాడు. భవిష్యత్ లో వారిని కలిసే అవకాశం వస్తుందని భావిస్తున్నానని చెప్పాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ, ఐపీఎల్ లో బాగా రాణించాలని కోరుకుంటున్నానని తెలిపాడు.

nagar koti
India u-19 player
new talent
  • Loading...

More Telugu News