sonu nigam: బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ ను చంపేస్తామంటూ బెదిరింపులు!

  • ఆజాన్ ను వ్యతిరేకించిన సోనూ నిగమ్
  • సుప్రీంతీర్పును సమర్ధిస్తూ, థియేటర్ లో జాతీయగీతాలాపన ప్రదర్శన తనకు కూడా ఇష్టం లేదన్న సోనూ నిగమ్
  • సోనూను హతమారుస్తామంటున్న కొన్ని వర్గాలు

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్‌ ను హతమారుస్తామంటూ దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. వేకువ జామునే ముస్లింలు నమాజ్ కోసం ఇచ్చే ఆజాన్ పిలుపుతో నిద్రాభంగమవుతోందని సోనూ చేసిన ట్వీట్ పెను దుమారం రేపింది. పలువురు దీనిని విమర్శించగా, మరికొందరు హతమారుస్తామంటూ బెదిరింపులకు దిగారు.

 ఆ సమయంలో ముంబై పోలీసులు ఆయనకు భద్రతను పెంచారు. ఒక ముస్లిం మతపెద్ద ఆయనకు గుండు చేయించి ఊరేగించాలని ఫత్వా కూడా జారీ చేశాడు. ఆయనకు కౌంటర్ గా తనకు తానే గుండు చేసుకుని సోనూ నిగమ్ మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు.

ఆ తరువాత వ్యక్తిగత దూషణలు పెరిగిపోవడంతో సోషల్ మీడియా నుంచి తప్పుకున్నాడు. ఇటీవల సినిమా హాళ్లలో జాతీయగీతాలాపన తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ, థియేటర్లలో జాతీయ గీతం ప్రసారం చేయడం తనకూ ఇష్టంలేదని వ్యాఖ్యానించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని వర్గాలు ఆయనను హతమారుస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ఈ మేరకు ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేయడంతో ఆయన నివాసం వద్ద ముంబై పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

sonu nigam
Bollywood singer
  • Loading...

More Telugu News