crda: రాజధాని ప్రాంతంలో భూకుంభకోణం వ్యవహారాన్ని 4 రోజుల క్రితం గుర్తించాం: సీఆర్డీఏ కమిషనర్‌

  • విచారణ అధికారిని నియమించాం
  • రిజిస్ట్రేషన్ రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయించాం
  • ఉద్దేశ పూర్వకంగా జరిగిందని భావిస్తున్నాం
  • ఎవరినీ ఉపేక్షించబోము

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కొందరికి లబ్ది కలిగేలా భూ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజధాని ప్రాంతంలో భూకుంభకోణం వ్యవహారాన్ని 4 రోజుల క్రితం గుర్తించామని తెలిపారు.

ఇప్పటికే ఈ విషయంపై విచారణ అధికారిని నియమించామని, రిజిస్ట్రేషన్ రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయించామని తెలిపారు. ఈ వ్యవహారం ఉద్దేశ పూర్వకంగా జరిగిందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించబోమని తెలిపారు. అలాగే, భూములిచ్చిన వారికి 59 వేల ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవకతవకలు జరిగేందుకు ఆస్కారం లేదని అన్నారు.  

  • Loading...

More Telugu News